వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం దివ్యాంగులకు, వయోవృద్దులకు నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలపై వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.