క్షయ వ్యాధి నిర్మూలనకు సకాలంలో క్రమం తప్పకుండా వైద్యచికిత్స పొందడం, మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంను పురస్కరించుకొని కెఎంసి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఐదు గ్రామాలను క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు.