కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దోహదపడుతుందని, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అనుసరించే కఠోర ఉపవాసం వారి జీవన విధానంలో గొప్ప మార్పులకు దోహదపడుతుందని, దైవ ప్రార్థనలు జీవిత పరమార్థాన్ని తెలియపరుస్తాయన్నారు.