సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సూర్యపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం 5:45కు రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ చేరుకొని తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రాంభించే అవకాశం ఉంది.