రాష్ట్రంలో భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. చింతూరు మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరమైతేనే బయటికు రావాలని ప్రజలకు సూచించింది.