ఎల్ఆర్ఎస్ లో ఏర్పడే సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30, 31 తేదీల్లో సెలవులు ఉన్నప్పటికీ బల్దియా పరిధిలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ లు, పనిచేస్తాయని, 25 శాతం రిబెట్ తో కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ సువర్ణ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సేలవు రోజుల్లో కూడా హెల్ప్ డెస్క్ లో సందేహాలు నివృత్తి చేసుకోవలన్నారు.