ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని వృద్ధులకు తరుచు ఆరోగ్య పరీక్షలు చేసుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బి. నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సాయి ఓల్డ్ ఏజ్ హోమ్, ఎలగందుల అమృత స్మారక వృద్ధాశ్రమాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.