న్యూఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖో-ఖో టోర్నమెంట్లో శనివారం తెలంగాణ పురుషుల జట్టు విజయకేతనం ఎగురవేసింది. కర్ణాటకను 18-6 పాయింట్ల తేడాతో ఓడించింది. తర్వాత రాజస్థాన్, ఆర్ఎస్బి బెంగళూరు జట్లతో తలపడి విజయకేతనం ఎగురవేసి క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆర్ఎస్బి ముంబైతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ పురుషుల జట్టు తలపడనున్నది.