
వరంగల్: అంబాల చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సీపీ
అక్రమ ఇసుక రవాణా కట్టడికై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అంబాల శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం తనిఖీ చేశారు. తనిఖీ నిర్వహిస్తున్న తీరును సంబంధిత చెక్ పోస్ట్ సిబ్బందిని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలని, నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని సూచించారు.