బీఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఆదివారం మాజీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రెస్మీట్ నిర్వహించారు. అజాంజాహి మిల్లు కార్మికులను కాంగ్రేస్ పార్టీ మోసం చేసిందన్నారు. కార్మికులను నమ్మించి మోసం చేశారన్నారు. కార్మిక భవనం సర్వే నెంబర్ మార్చి గొట్టిముక్కల నరేష్ రెడ్డి అనే వ్యక్తికి అప్పగించారు. 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మార్వో ద్వారా సర్వే నెంబర్ మార్చారన్నారు.