హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలో నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఫాక్స్ కాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు.