లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ను సందర్శించారు. స్టడీ సర్కిల్ లోని విద్యార్థుల డార్మెట్రీ, లైబ్రరీ, డైనింగ్ హాల్, వంటగది పరిశీలించారు. స్టడీ సర్కిల్ ఉద్యోగార్థులకు 75 రోజుల పాటు చేపట్టిన ఉచిత శిక్షణా తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు.