
హన్మకొండ: సాయిబాబా మందిరంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ప్రత్యేక పూజలు
హనుమకొండ సాయిబాబా మందిరంలో గురువారం ట్రాఫిక్ ఏసీపీ తీర్థాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరానికి వారి ఇరువురు కుమార్తెలలతో విచ్చేయగా పూజారులు మణిశర్మ, చందులు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించడం జరిగింది. మందిర ఛైర్మన్ శ్రీ మతుకుమల్లి హరగోపాల్ శర్మ బాబా శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర ధర్మకర్తలు నిమ్మల శ్రీనివాస్, రాకం సదానందం, వెయ్యిగండ్ల రమేష్ పాల్గొన్నారు.