గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం సర్కిల్, పోస్టాఫీసు దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ స్తంభాలను తొలగించి కొత్తవి పెట్టారు. అయితే పాత స్తంభాలను మాత్రం అలాగే గాలికి వదిలేశారు. అవి పనిచేయకపోవడమే కాకుండా కొత్త స్తంభాలకు అడ్డుగా ఉండడం ద్వారా ప్రయాణికులకు ఎటువైపు సిగ్నల్ పడిందో అర్థం కాక వాహనదారులు సతమతమై యాక్సిడెంటులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.