

వరంగల్: రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం చేస్తామంటే తీవ్ర చర్యలు: మంత్రి
హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రామరాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణ రాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి స్పష్టం చేశారు. కొందరు దుండగుల దాడిలో గాయపడి తీవ్ర విచారంలో వున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ తో పాటు వారి తండ్రి సౌందర రాజన్ ను సోమవారం పరామర్శించారు.