విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు టాయిలెట్‌లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. దాంతో సిగరెట్ పొగ బోగీ మొత్తం వ్యాపించింది. ఒక్కసారిగా భోగీ మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని ఎవరో సిగరెట్ తాగడం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రయాణికులు టీసీని నిలదీశారు. దానికి నేనేమి చేస్తాను అంటూ టీసీ సమాధానమిచ్చారు.