ప్రజల వినతులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వరంగల్ బల్దియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.