TG: ఆస్తి కోసం భర్తతో కలిసి అక్క తమ్ముడిని హత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేటలో వెలుగు చూసింది. ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక అక్క ఉన్నారు. తల్లిని సరిగా చూడడం లేదని కనకయ్య అక్క యాదవ్వ తల్లి బాగోగులు చూసుకుంటూ తల్లి పేరున ఉన్న 3 ఎకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. భూమిని తిరిగి ఇవ్వమని తమ్ముళ్లు అడగటంతో గొడవలు జరిగాయి. దీంతో కనకయ్యపై కక్ష పెంచుకుని హత్య చేశారు. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు.