వరంగల్: రూ. 4 లక్షల విలువైన 15 కిలోల ఎండు గంజాయి పట్టివేత

69பார்த்தது
వరంగల్ రైల్వేస్టేషన్ లో ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని భద్రక్ జిల్లా ముళ్లసాహి గ్రామానికి చెందిన సుమన్ ఖాద్రీ బ్యాగు పరిశీలించగా 4 లక్షల విలువైన 15 కిలోల ఎండు గంజాయి లభించింది. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాదు రైలులో గంజాయి రవాణా చేస్తున్నట్లు ఒప్పకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం జీఆర్పి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி