రేపు మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా మారుస్తామని అధికారులు తెలిపారు.