వరంగల్ ఇంతేజరగంజ్ పరిధిలోని 11 మంది రౌడీషీటర్లను శుక్రవారం పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్. రౌడీ షీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్థులుగా తయారవుతారని, నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్గా ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.