హెలికాప్టర్ ద్వారా నిర్వహిస్తున్న డిజటల్ ఏరియల్ భూ సర్వే ప్రక్రియను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఖాజీపేటలో సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహణ తీరును సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ ద్వారా 'నక్ష' పథకంలో ప్రణాళికలు లేని పట్టణాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే నిర్వహించడం జరుగుతున్నదన్నారు.