ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదవ ఎడిషన్ పరీక్షపే చర్చను ప్రోజెక్టర్ పై ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల పాఠశాల పిల్లలు నరేంద్ర మోదీని వారికున్న సందేహాలను అడిగి పరిష్కరించుకున్న తీరుని ఎస్ఆర్ విద్యార్థులు ఆసక్తితో గమనించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.