ఢిల్లీ నుండి గల్లీ వరకు బిజెపి పార్టీ విస్తరిస్తుందని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బిజెపి పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం వరంగల్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశంలో మోడీ నాయకత్వం మరింత బలపడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.