పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగులతో పాడించాలనుకున్నానని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే ముందుగా ఆ ఛాన్స్‌ను 'గోదారి గట్టు' పాటతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్ కొట్టేసిందని హరీష్ నవ్వుతూ అన్నారు.