
చెన్నూర్: 100 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
చెన్నూర్ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన 14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.