భీమారం మండలంలోని రాంపూర్ గ్రామంలో మేకల బాబునకు చెందిన గేదెను పెద్దపులి హతమార్చినట్లు అటవీ అధికారులు శుక్రవారం గుర్తించారు. బాదంపూర్, రెడ్డిపల్లి, కాజిపల్లి, ఆవుడం, కొత్తూరు పరిసర గ్రామాల్లో పెద్దపురి సంచరిస్తుందని ఆయా గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా ప్రజలు ఎవరు వెళ్ళవద్దని ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు హెచ్చరించారు. రాత్రి సమయంలో బయటకు రావద్దని అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.