మాజీ సీఎం KCRపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఏటా 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలకులు భూసేకరణ చేయలేదని, నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. అన్ని ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తామన్నారు.