AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పలువురు వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు ప్రచారం. ఈ చేరికలకు కర్త, కర్మ, క్రియగా మాజీ మంత్రి బాలినేని వ్యవహరించినట్లు సమాచారం.