తక్కువ ధరల్లో హెూటల్ గదులు అందిస్తూ హెూటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న 'ఓయో'ను బాయ్‌కాట్ చేయలంటూ నిరసనలు వెలువడుతున్నాయి. 'ఓయో' సంస్థ న్యూస్ పేపర్లో ఇచ్చిన ఓ ప్రకటన మతపరంగా వివాదంగా మారింది. "దేవుడు ప్రతిచోట ఉన్నాడు'. కిందే 'ఓయో కూడా' అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నెటిజనులు 'బాయ్‌కాట్ ఓయో' ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.