సోషల్ మీడియా పోస్టులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.