మందమర్రి మండలం పోన్నారం గ్రామంలో ఆదివారం ఎంపిక చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రైతు భరోసా 842, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 44, రేషన్ కార్డులు 65, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్దిదారులకు అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీరటీ రాజేశ్వరి, తాసిల్దార్ సతీష్, ఎంపీడీఓ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ ఏడీ బాణోత్ ప్రసాద్ పాల్గొన్నారు.