ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రముఖ పాత్ర పోషించారని మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రగతి పథంలో నడిపించారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.