ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ వేదికగా జరుగుతున్న 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ప్రధాని మోదీ, ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ నడుమ ఆసక్తికర ఘటన జరిగింది. పవార్ కుర్చీలో కూర్చోవడానికి మోదీ సాయం చేయడంతో పాటు, తన చేతితో స్వయంగా గ్లాసులో నీళ్లు నింపి పవార్‌కు అందించారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.