పరిచయం ఉన్న మహిళలకు అయినా.. రాత్రిపూట మెసేజ్‌లు చేస్తే అసభ్యత కిందకే వస్తోందని ముంబై సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. “మీరు స్లిమ్‌గా ఉన్నారు. స్మార్ట్‌గా ఉన్నారు. మీకు పెళ్లైందా?” అంటూ మెసేజ్‌లు చేసిన ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు మూడ్నేళ్ల శిక్షను సమర్థిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదని, ఈ చర్య అశ్లీలత కిందకే వస్తుందని తెలిపింది.