విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎస్సై శ్వేతా ఆధ్వర్యంలో భీమారం జడ్పీ పాఠశాల విద్యార్థులతో ఆవడం క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహదారులు తప్పకుండా అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.