నేరాల నియంత్రణకు కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని అంగడి బజార్లో ఏర్పాటుచేసిన నాలుగు సీసీ కెమెరాలను కాలనీవాసులతో కలిసి సిఐ ప్రారంభించారు. నేర నిరూపణ లో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు.