టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మందమరి ఏరియా శాంతిఖనిగని ఆవరణలో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు సాజన్, రమేష్, కిరణ్ లు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా కార్మికుల పక్షాన తమ సంఘం ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.