మందమర్రి మండలంలో గణతంత్ర దినోత్సవం రోజున ఆదివారం విచ్చలవిడిగా మద్యం, మాంసం అమ్మకాలు కొనసాగాయని విమర్శలు వెల్లువెత్తాయి. చికెన్ సెంటర్లు, బెల్ట్ షాప్ లలో విచ్చలవిడిగా మద్యం, మాంసం అమ్ముతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. బాహటంగానే విక్రయాలు జరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.