మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మార్కెట్ హనుమాన్ టెంపుల్ లో అఖిలపక్షం నాయకులు, కుల సంఘాల నాయకులు, వ్యాపార సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత ముప్పై ఏళ్లుగా పాలక వర్గం లేక మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు జరిపించే వరకు తమ పోరాటం ఆగదని ఎన్నికల సాధన కమిటీ సభ్యులు తెలిపారు.