
మందమర్రి: పాఠశాల శుభ్రం చేయాలని శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన 13 మందికి రెండు రోజులపాటు సామాజిక సేవ చేయాలని గురువారం కోర్టు శిక్ష విధించినట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పోలీసులకు 13 మంది పట్టుబడ్డారు వీరిని కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయస్థానం రెండు రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలో శుభ్రం చేయాలని శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.