

చెన్నూర్: సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
చదువుల తల్లి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే యువజన సంఘం చెన్నూర్ కమిటీ ఆధ్వర్యంలో పూలేచౌక్ లో గల పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు, పూలే యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.