విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం మరోసారి బాక్సాఫీసు ముందుకు రానుంది. మార్చి 7న పలు థియేటర్లలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా రీరిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటన చేసింది. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలై మంచి విజయం అందుకుంది.