కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం కేతనపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.