యూపీలోని కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ హైవే బదౌరి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. నంబర్ ప్లేట్ లేని కొత్త ట్రక్కు అతి వేగంగా వచ్చి 6 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహా కుంభ స్నానానికి వెళ్తున్న భక్తులు సహా 6 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత టోల్ ప్లాజా వద్ద గందరగోళం నెలకొంది. అంబులెన్స్ అందుబాటులో లేక క్షతగాత్రులు ఇబ్బంది పడ్డారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.