

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి (వీడియో)
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణానికి చెందిన రజిత అనే వివాహిత ఉరి వేసుకుని చనిపోయింది. ఆరునెలల క్రితం పవన్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుందని, తమ అల్లుడే రజితని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.