మహారాష్ట్రలో షాకింగ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఓ మహిళా వైద్య పరీక్షల నిమిత్తం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెసిడెంట్ కాంప్లెక్స్ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షల అనంతరం ఆసుపత్రి బయటకు రాగా.. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మహిళపై దూసుకెళ్లింది. కారు ఆమెను కొంత దూరం లాక్కెళ్లింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అప్రమత్తమై ఆమెను కారు కింద నుంచి బయటకు తీశారు. కానీ తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ సదరు మహిళ మృతి చెందింది.