AP: తిరుపతి జిల్లాలో 'కోర్టు' సినిమా తరహా ఘటన జరిగింది. చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక నిఖిత, మిట్టపాళేనికి చెందిన అజయ్ ప్రేమించుకున్నారు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోక్సో కేసులో అజయ్ జైలుకు వెళ్లాడు. నిఖిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గంటలోనే ఆమె పేరెంట్స్ అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక పేరెంట్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.