TG: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాజేడు మండలం కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన వాసం విజయ్ (28) అనే గిరిజన యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి, అతి దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.