బుగ్గారం జి. పి. నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ లే పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలన్నారు. మొత్తం ప్రజా ధనాన్ని రికవరీ చేయించాలన్నారు.